బంగారం ధరలు నేడు ప్రారంభంలో స్వల్పంగా పెరిగినప్పటికీ, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. గతవారం రూ.47,000 స్థాయికి పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న పెరిగాయి. నేడు మళ్లీ క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 వద్దే ఉంది. సిల్వర్ రూ.300 వరకు క్షీణించి రూ.67,500 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1780 డాలర్ల దిగువకు, వెండి 26 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9200 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11వేలకు పైగా తక్కువగా ఉంది.

బంగారం డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.47.00 (0.10%) తగ్గి రూ.47027.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,178.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,247.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,869.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.40.00 (0.08%) తగ్గి రూ.47330.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,494.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,548.00 గరిష్టాన్ని, రూ.47,203.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి కూడా అదే దారి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.287.00 (0.42%) తగ్గి రూ.67475.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,755.00 వద్ద ప్రారంభమై, రూ.68,051.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,158.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.292.00 (0.42%) తగ్గి రూ.68470.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,770.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,063.00 గరిష్టాన్ని, రూ.68,214.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.95 (0.22%) డాలర్లు పెరిగి 1,778.95 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,772.25 - 1,790.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.188 (0.72%) డాలర్లు తగ్గి 25.843 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.742 - 26.085 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications