Gold prices today: రూ.48,000కు చేరువలో బంగారం, అక్కడ 1800 డాలర్లు క్రాస్
బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ ఆందోళన సహా వివిధ అంశాలు పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో నిన్న రూ.500 వరకు పెరిగి ఓ సమయంలో రూ.48,000 తాకిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు కూడా ప్రారంభ సెషన్‌లో స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8500 తక్కువగా ఉంది. ఇక, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.411 పెరిగి రూ.47,710 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.444.00 పెరిగి రూ.48,010 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ సెప్టెంబర్ రూ.455 క్షీణించి రూ.69,584 వద్ద, డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.426.00 క్షీణించి రూ.70,968 వద్ద ముగిసింది.

మళ్లీ పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం సెషన్లో రూ.68.00 (0.14%) పెరిగి రూ.47752.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,761.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,764.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.47,690.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.36.00 (0.08%) పెరిగి రూ.48032.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,063.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,063.00 గరిష్టాన్ని, రూ.48,028.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు డౌన్
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఉదయం సెషన్లో రూ.4.00 (0.01%) తగ్గి రూ.69508.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,620.00 వద్ద ప్రారంభమై, రూ.69,620.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.69,482.00 వద్ద కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.16.00 (0.02%) పెరిగి రూ.70905.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,899.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,905.00 గరిష్టాన్ని, రూ.70,899.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగి 1800 డాలర్లను దాటేశాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 7.45 (0.42%) డాలర్లు పెరిగి 1,801.65 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,794.10 - 1,802.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.108 (0.41%) డాలర్లు పెరిగి 26.282 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.170 - 26.285 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications