Gold price today: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు, ఇక్కడ మాత్రం...
గతవారం క్షీణించిన బంగారం ధరలు ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో లాభాలతో ఆరంభించాయి. ఎంసీఎక్స్‌లో మాత్రం ప్రారంభంలో స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో చివరి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,923.70 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.51,275 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు ధరలు పెరిగాయి.
ఓ వైపు స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టగా, మరోవైపు బులియన్ మార్కెట్ కూడా లాభాల్లో ఉంది. బంగారం ధరలపై డాలర్, రష్యా-ఉక్రెయిన్ పరిస్థితులు, అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెంపు, అమెరికా ద్రవ్యోల్భణం, నిరుద్యోగ తదితర డేటా, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.

మధ్యాహ్నం గం.12.40 సమయానికి ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.116 క్షీణించి రూ.51,228 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.161 తగ్గి రూ.51,445 వద్ద కనిపించింది. సిల్వర్ ధరలు మాత్రం పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.331 పెరిగి రూ.67,064 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.299 లాభపడి రూ.67,789 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు 7.30 డాలర్లు లాభపడి 1,931.95 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.326 డాలర్లు ఎగిసి 24.980 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 145 డాలర్లు తక్కువగా ఉంది. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.4800 వరకు తక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications