Gold prices: అక్కడే కదలాడుతున్న బంగారం ధరలు
బంగారం ధరలతో పాటు నేడు వెండి ధరలు కూడా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లు క్రాస్ చేసి 1815 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.48,000 దిశగా వెళ్తోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8300 తక్కువగా ఉంది. బంగారం ధరలు మూడు రోజుల క్రితం రూ.48,000 టచ్ చేసినప్పటికీ, అప్పటి నుండి రూ.47,700కు పైన, రూ.48,000కు దిగువన కదలాడుతోంది.
ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.154.00 (0.32%) పెరిగి రూ.47875.00కు పెరిగింది. రూ.47,844.00 ప్రారంభమైన ధర, రూ.47,943.00 గరిష్టాన్ని, రూ.47,621.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.94.00 (0.20%) పెరిగి రూ.48130.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,176.00 ప్రారంభమైన ధర, రూ.48,191.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.47,920.00 కనిష్టాన్ని తాకింది.

సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.268.00 (0.39%) పెరిగి రూ.69230.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,789.00 ప్రారంభమై, రూ.69,445.00 గరిష్టాన్ని, రూ.68,425.00 కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.383.00 (0.55%) పెరిగి రూ.70640.00 ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 10.05 (+0.56%) డాలర్లు పెరిగి 1810 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 26.238 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications