కరోనా దెబ్బ: భారీగా పెరుగుతున్న బంగారం ధర, నేడు ఏడేళ్ల గరిష్టానికి
బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 10) ఉదయం ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో ఒకటిన్నర లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడం, ఈ వైరస్ వ్యాప్తి మళ్లీ పుంజుకోవడం, ఆర్థిక వ్యవస్థను ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న చర్యల నేపథ్యంలో బంగారం ఏడేళ్ల గరిష్టానికి చేరుకుంది. పెట్టుబడులకు బంగారం వంటి అతి ఖరీదైన లోహాలను స్వర్గదామంగా చూస్తున్నారు.

పెరిగిన ఫ్యూచర్స్ ధర
ఫెడ్ 2.3ట్రిలియన్ అదనపు ప్యాకేజీని ప్రకటించిన అనంతరం బంగారానికి రెక్కలు వచ్చింది. 4.2 శాతం మేర పసిడి ధర పెరిగింది. నిరుద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అమెరికాలో రోజు రోజుకు పెరుగుతోంది. బంగారంతో పాటు వెండి ధరకూడా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ఫ్యూచర్ గోల్డ్, స్పాట్ గోల్డ్ ధరలు...
అంతర్జాతీయ మార్కెట్లోని న్యూయార్క్ కామెక్స్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 4 శాతానికి పైగా పెరిగి 1,752.80 డాలర్లు పలికింది. అక్టోబర్ 2012 తర్వాత బంగారం ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. మెటల్ ఈ వారంలో 6.5 శాతం మేర పెరిగింది. స్పాట్ గోల్డ్ 2.2 శాతం పెరిగి 1,681.94 పలికింది.

1700 డాలర్లు దాటే అవకాశం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వారంలో 1700 డాలర్లు దాటే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 1704 డాలర్ల నుండి 1714 డాలర్ల మేరకు చేరుకోవచ్చునని అంటున్నారు. ఇండియాలోను బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.100, 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది.


Click it and Unblock the Notifications