మళ్లీ పెరిగిన బంగారం ధరలు, వెండి రూ.500కు పైగా జంప్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బుధవారం (డిసెంబర్ 24) క్షీణించిన పసిడి ధరలు ఆ తర్వాత పెరిగాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వరకు ధరలు పెరిగాయి. రూ.47,500 స్థాయికి పడిపోయిన ఫ్యూచర్ గోల్డ్, ఆ తర్వాత రూ.51,000 సమీపానికి చేరుకుంది. అయితే నిన్న క్షీణించాయి. ఈ రోజు ప్రారంభంలోను తగ్గింది. కానీ అంతలోనే మళ్ళీ పెరుగుదలను నమోదు చేశాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి రూ.6000 తక్కువగా ఉంది.

రూ.140 పెరిగిన పసిడి
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.140.00 (0.28%)పెరిగి రూ.50221.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,042.00 వద్ద ప్రారంభమై, రూ.50,280.00 గరిష్టాన్ని, రూ.49,680.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.174.00 (0.35%) పెరిగి రూ.50283.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,134.00 వద్ద ప్రారంభమై, రూ.50,313.00 గరిష్టాన్ని, రూ.49,756.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ రూ.500 జంప్
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.509.00 (0.76%) పెరిగి రూ.67380.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,687.00 వద్ద ప్రారంభమై, రూ.67,630.00 గరిష్టాన్ని, రూ.66,251.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.566.00 (0.84%) పెరిగి రూ.68260.00 వద్ద ట్రేడ్ అయింది.
రూ.67,530.00 వద్ద ప్రారంభమై, రూ.68,490.00 గరిష్టాన్ని, రూ.67,235.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను..
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 10.65 (+0.57%) పెరిగి 1,880.95 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,862.30 - 1,883.40 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 23.58% పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ +0.227 (+0.89%) పెరిగి 25.773 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.185 - 25.913 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 44.67% పెరిగింది.


Click it and Unblock the Notifications