బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆల్ టైమ్ గరిష్టం సమీపానికి చేరుకున్న పసిడి ధరలు ఆ తర్వాత రూ.4000 వరకు క్షీణించాయి. అయితే ఇప్పుడు మళ్లీ స్వల్ప పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,000కు దిగువనే ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.69,000ను సమీపించాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1920 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1940 డాలర్లకు సమీపంలో ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.185 క్షీణించి రూ.51,840 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.243 లాభపడి రూ.52,193 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.485 లాభపడి రూ.68,834 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.416 లాభపడి రూ.69,604 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 7.50 (0.39%) లాభపడి 1,937.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,929.5 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో 1,929.85 - 1,938.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 0.204(0.81%) డాలర్లు ఎగిసి 25.517 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 25.325 - 25.575 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications