బంగారం ధరలు బాగా తగ్గాయని సంతోషపడేలోపే మళ్లీ బంగారం ధరలు పెరగడం బంగారం ప్రియులకు షాక్ ఇస్తుంది. ఇక ఈ పరిస్థితులు మారవు అనే భావన బంగారం కొనుగోలుదారులలో కలుగుతుంది.పసిడి రేట్లు తగ్గినట్టే తగ్గి మళ్లీ పసిడి పరుగులు పెడుతున్న పరిస్థితి బంగారం ప్రియులను గందరగోళానికి గురి చేస్తుంది.
ఈ వారం ప్రారంభంలోనే బంగారం ధరలు దూకుడుగా ఉండటం, నేడు రేటు మళ్ళీ పెరగడం ఈ వారంలో బంగారం ధర ఏ స్థాయికి చేరుతుందో అన్న అనుమానానికి కారణం అవుతుంది. ఇక నేడు దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారానికి 110 రూపాయలు,10 గ్రాముల స్వచ్ఛమైన బంగారానికి 120 రూపాయలు మేర ధర పెరిగింది.

నేడు దేశీయంగా బంగారం ధర పది గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 56 వేల 600 రూపాయలు కాగా,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 61 వేల 750 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,750 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,900 రూపాయలు గా ప్రస్తుతం ట్రేడవుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,600 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 750 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల 600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 750 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నంబూరు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,600 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,750 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
భారతదేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూర్, సేలం, ఈ రోడ్, తిరుచ్చి, తిరునవ్వేలి, తిరుపూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57 వేల 100 రూపాయలకు ట్రేడవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62 వేల 290 రూపాయలుగా విక్రయించబడుతుంది.


Click it and Unblock the Notifications