బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈ రోజు నుండి (ఏప్రిల్ 20) కరోనా ప్రభావం లేని చోట లాక్ డౌన్ విషయంలో కొన్ని మినహాయింపులు ఉండనున్నాయి. అలాగే డాలర్ మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. ఈ ప్రభావం బంగారంపై పడింది. పై అంశాలు ఇతర కరెన్సీలలో పెట్టుబడిదారులకు పసిడి ఖరీదుగా మారుస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లో 2 రోజులు డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజు స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.5 శాతం తగ్గి 16,775.92 డాలర్లు పలికింది. ఏప్రిల్ 9వ తేదీ తర్వాత ఇదే కనిష్ట ధర. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పడిపోయి 1,687.20 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్‌లో (శుక్రవారం) బంగారం ధరలు 0.1 శాతం పడిపోయాయి.

మార్కెట్ల డైలమా
భారత్‌లో లాక్ డౌన్ నేపథ్యంలో కార్పోరేట్ ఆదాయాలు పడిపోయాయి. ఎనకమిక్ డేటా భారీ నష్టాన్ని చూపిస్తోంది. దీంతో ఆసియా మార్కెట్లు జాగ్రత్తగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు ఇటీవలి కాలంలో కోలుకుంటున్నప్పటికీ రికవరీ అయినట్లుగా పూర్తిగా చెప్పలేని అంటున్నారు.

తగ్గిన బంగారం ధర
సోమవారం (ఏప్రిల్ 20) ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ.45,465 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి రూ.45,450 పలికింది. గత వారం బంగారం ధర ఒకేరోజు ఏకంగా 3 శాతం లేదా రూ.1500 తగ్గింది. అంతకుముందు రూ.47,000 మార్క్ దాటిన బంగారం ఆ మరుసటి రోజు రూ.45,735 పలికింది.

బంగారం, వెండి ధరలు
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు ఓ సమయంలో 0.44 శాతం తగ్గి రూ.45,536 పలికింది. కిలో వెండి ధర 0.35 శాతం తగ్గి రూ.42,954 పలికింది.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications