కరోనా మహమ్మారి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత బంగారం వంటి అతి ఖరీదైన లోహాల వైపు చూస్తున్నారు. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతకుముందు కాస్త తగ్గుముఖం పట్టిన ధరలు గత ఆరు రోజులుగా పెరుగుతున్నాయి. ముంబై బులియన్ మార్కెట్‌లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.46,034 రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కనిపిస్తుండటంతో పసిడి వైపు చూస్తున్నారు.

ముంబై బులియన్ మార్కెట్లో ధరలు..
ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 18 క్యారెట్ల బంగారం రూ.34,526, 22 క్యారెట్ల పసిడి రూ.42,167, 24 క్యారెట్ల బంగారం రూ.46,034 పలికింది. దీనికి జీఎస్టీ అదనం.

బంగారం, డాలర్..
కరోనా వల్ల ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో బంగారం వంటి అతి ఖరీదైన లోహాలతో పాటు డాలర్ వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారం నెల గరిష్టానికి చేరుకున్న పసిడి ధరలు ఇప్పుడు రికార్డ్ హైకి చేరుకున్నాయి.

మార్కెట్ ట్రెండ్
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి బులియన్ ట్రెండ్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 1,675 డాలర్ల నుండి 1,705 డాలర్లు ఉండవచ్చునని, భారత మార్కెట్లో రూ.45,900 నుండి రూ.46,600 మధ్య ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ రోజు 1690 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా కనిపించింది. వెండి ధర కూడా ఈరోజు కిలో రూ.870 పెరిగి రూ.42,900 పలికింది.

ఫ్యూచర్ మార్కెట్
ఫ్యూచర్ మార్కెట్ విషయానికి వస్తే ఎంసీఎక్స్‌లో ఇంట్రాడే గరిష్టం రూ.46,385, కనిష్టం రూ.45,622 పలికింది. జూన్ సిరీస్ కనిష్టం రూ.36,572, గరిష్టం రూ.46,385 పలికింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ జూన్ రూ.961 (2.12 శాతం) పెరిగి రూ.46,255 వద్ద క్లోజ్ అయింది. ఆగస్ట్ డెలివరీ రూ.947 (2.08 శాతం) పెరిగి రూ.46,433 వద్ద క్లోజ్ అయింది. బంగారం ధర దాదాపు రూ.1,000 వరకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్ పసిడిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నాడు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications