మళ్ళీ కాస్త క్షీణించిన బంగారం ధరలు.. తెలుగురాష్ట్రాలో లేటెస్ట్ బంగారం ధరలివే!!
బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతూనే ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం ధరలు నిరాశను మిగులుస్తున్నాయి. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో బంగారం షాపుల వైపు చూడాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే రికార్డు స్థాయి ధరలతో దూసుకుపోతున్న బంగారం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు 70 వేలకు చేరుకుంటాయని చెబుతున్న పరిస్థితి ఉంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే భారతదేశంలో నేడు బంగారం ధరలు కొద్దిగా క్షీణించాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 200 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 220 రూపాయల మేర ధర తగ్గింది.

ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలు చూసినట్లయితే హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,750 రూపాయలుగా ట్రేడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,820 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,900 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,970 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,750 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,820 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. బెంగళూరు లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 800 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 గా ప్రస్తుతం కొనసాగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, రాజమండ్రి ,కాకినాడ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,750 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 820 గా ప్రస్తుతం ట్రేడవుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరుపూరు, తిరునవ్వేలి లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 56,200 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు 61,310రూపాయల వద్ద కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications