Gold Price Today: పెరిగిన బంగారం ధరలు, రూ.200 జంప్
బంగారం, వెండి ధరలు నేడు (జూలై 2 శుక్రవారం) పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో సాయంత్రం నాటికి ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 191.00 (0.41%) పెరిగి రూ.47230.00 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం రూ.47,139.00 వద్ద ప్రారంభమై, రూ.47,515.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,139.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.171.00 (0.36%) పెరిగి రూ.47492.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,430.00 వద్ద ప్రారంభమై, రూ.47,767.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,421.00 వద్ద కనిష్టాన్ని ఉంది.
సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. సిల్వర్ జూలై ఫ్యూచర్ రూ.879.00 (1.29%) కోట్లు పెరిగి రూ.69034.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,449.00 వద్ద ప్రారంభమై, రూ.69,328.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,429.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.906.00 (1.31%) పెరిగి రూ.70026.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,224.00 వద్ద ప్రారంభమై, రూ.70,360.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,224.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.65 (+0.32%) కోట్లు పెరిగి 1782.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.1,774.55 - 1,795.90 మధ్య ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.437 (+1.68%) డాలర్లు పెరిగి 26.512 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.098 - 26.668 మధ్య ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications