Gold prices Today: నేడు భారీగా పెరిగిన బంగారం ధర, మూణ్ణెళ్లలో 20 శాతం

కరోనా మహమ్మారి, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. ఈ రోజు ఉదయం ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.72 శాతం లేదా రూ.342 తగ్గి రూ.47,072 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 1.55 శాతం లేదా రూ.752 తగ్గి రూ.47,887 పలికింది. బహిరంగ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్ గోల్డ్ ధర రూ.477 పెరిగింది. వెండి ధర రూ.26 పెరిగి కిలో రూ.49,868కి చేరుకుంది.

పెరుగుతూ.. తగ్గుతూ

పెరుగుతూ.. తగ్గుతూ

ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు గత సెషన్‌లో రూ.800 పెరిగింది. ఈ రోజు ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.7 శాతం పడిపోయింది. కరోనా మహమ్మారి కేసులు, అమెరికా, బ్రిటన్ సహా వివిధ ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం, ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ చర్యలు బంగారంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవలి వరకు డాలర్ వ్యాల్యూ ఇతర కరెన్సీలతో పోలిస్తే తగ్గింది. దీంతో బంగారం ధర పడిపోయింది. ఇప్పుడు కాస్త స్థిరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇండియాలో స్పాట్ గోల్డ్ మాత్రం రూ.500 వరకు పెరిగింది.

వారంలో 2.5 శాతం పెరుగుదల

వారంలో 2.5 శాతం పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు అంతకుముందు పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి ఔన్స్ ధర 1,732.08 డాలర్లు పలికింది. ఈ వారంలో బంగారం ధర ఇప్పటి వరకు 2.5 శాతం పెరిగింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం 0.1 శాతం తగ్గి ఔన్స్ 1,738.60 డాలర్లు పలికింది. బ్రిటన్ ఎకానమీ ఏప్రిల్ నెలలో ఏకంగా 20.4 శాతం క్షీణించిందని డేటా వెల్లడైన నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు.

అందుకే బంగారం ధర పెరిగింది

అందుకే బంగారం ధర పెరిగింది

గత కొద్ది రోజుల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని, ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో తిరిగి ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి పరిస్థితులు సానుకూలంగా ఉంటే బంగారం ధర రూ.46,500 వద్ద ఉంటుందని భావించారు. కానీ కరోనా రెండోసారి పుంజుకోవచ్చుననే వార్తలు, అమెరికా ఎకానమీ కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చుననే అంచనాలు, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించడం వంటివి బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి.

3 నెలల్లో ఏకంగా 20 శాతం పెరిగింది

3 నెలల్లో ఏకంగా 20 శాతం పెరిగింది

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మార్చి నెలలో 1451 డాలర్లు పలికింది. అప్పటి నుండి కరోనా కారణంగా పెరుగుతూ 1700 డాలర్లకు పైకి చేరుకుంది. గత వారంలో రుజ్లలో బంగారం ధరలు 2.5 శాతం పెరిగితే, మూడు నెలల్లో ఏకంగా 20 శాతచం పెరిగాయి. అంటే కరోనా కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు చమురు ధరలు పడిపోవడం కూడా బంగారంపై ఒత్తిడిని పెంచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+