బంగారం ధరలు గతవారం హెచ్చుతగ్గులు చూశాయి. గతవారం ప్రారంభంలో క్షీణించి, తర్వాత ధరలు పెరిగాయి. అయినప్పటికీ వారం మొత్తంలో స్వల్పంగా మాత్రమే పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో గత శుక్రవారం రూ.46,800 వద్ద ట్రేడ్ అయి, . అంతకుముందు గురువారం రూ.47,295 వద్ద ముగిసింది. దేశ రాజధానిలో గత మంగళవారం రూ.46,762కు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 1790 డాలర్ల దిగువన ప్రారంభమై, చివరకు 1808 డాలర్ల వద్ద ముగిసింది.

గతవారం ఇలా ముగిసింది
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధరలు రూ.47,350 దిగువన ప్రారంభమయ్యాయి. వారం చివరలో రూ.47,910 వద్ద ముగిసింది. వారం ముగిసేసరికి దాదాపు రూ.600 పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. రూ.70,500 వద్ద ప్రారంభమైన ధర, గతవారంలో రూ.1000కి పైగా తగ్గి రూ.69,235 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్ల దిగువన ప్రారంభమై, చివరకు 1808 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26.5 డాలర్ల పైన ప్రారంభమై, దాదాపు 26 డాలర్ల స్థాయికి వచ్చింది.

మొత్తానికి స్వల్ప పెరుగుదల
ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు క్రితం సెషన్లో పెరిగాయి. బంగారం ధరలు వరుసగా మూడో వారం లాభాలను నమోదు చేశాయి. యూఎస్ యీల్డ్స్ క్షీణించడం, డాలర్ కాస్త పడిపోవడం, కరోనా థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్ ఆందోళనళ నేపథ్యంలో పసిడిపై గత కొద్ది రోజులుగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ధరలు స్వల్పంగా పెరిగాయి.

బంగారం ధరలు....
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.47,810, 22 క్యారెట్ల బంగారం రూ.46,800, ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.46,800, 22 క్యారెట్ల బంగారం రూ.47,800 పలికింది. 24 క్యారెట్ల పసిడి కోల్‌కతాలో రూ.49,900, బెంగళూరులో రూ.48,820, హైదరాబాద్‌లో రూ.48,820, పుణేలో రూ.47,800, జైపూర్‌లో రూ.50,960, లక్నోలో రూ.50,960, సూరత్‌లో రూ.49,150 పలికింది. 22 క్యారెట్ల పసిడి కోల్‌కతాలో రూ.47,200 పలికింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications