Gold prices today: పెరుగుతున్న కరోనా కేసులు, స్థిరంగా బంగారం ధరలు
అంతర్జాతీయంగా బంగారం ధరలు నేడు (గురువారం, మార్చి 25) స్థిరంగా ఉన్నాయి. అమెరికా ట్రెజరీ యీల్డ్స్ ప్రభావం, బలమైన డాలర్, పెట్టుబడులు క్రమంగా బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ వైపు మరలడం వంటి వివిధ కారణాలు ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల ధరలు వరుసగా తగ్గుతున్నాయి. అయితే కరోనా వేవ్ మరోసారి కనిపించడంతో నేడు స్థిరంగా ఉన్నాయి. యూరోప్ దేశాల్లో లాక్ డౌన్ ఆందోళనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్వల్పంగా పెరగగా, ఫ్యూచర్ గోల్డ్ దాదాపు స్థిరంగా ఉంది.

స్థిరంగా బంగారం ధరలు
గోల్డ్ ఫ్యూచర్ నేడు ప్రారంభ సెషన్‌లో స్థిరంగా ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.12.00 (0.03%) తగ్గి రూ.44848.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,892.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,897.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,835.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.3.00 (0.01%) పెరిగి రూ.45279.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,316.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45346.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,251.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండిదీ అదే దారి
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.176.00 (-0.27%) తగ్గి రూ.65069.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,159.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,160.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,030.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.48.00 (-0.07%) తగ్గి రూ.66320.00 వద్ద ట్రేడ్ అయింది.

1734 డాలర్ల వద్ద..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.25 (+0.07%) డాలర్లు పెరిగి 1,734.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,730.85 - 1,738.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. ఔన్స్ ధర 0.103 (-0.41%) డాలర్లు తగ్గి 25.128 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.003 - 25.210 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications