ముంబై: బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా క్షీణిస్తూ వస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో గతవారం నుండి ధరలు పెరుగుతున్నాయి. నేడు కూడా గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.300 వరకు పెరిగింది. గత కొద్ది సెషన్లుగా పసిడి రూ.45,000కు పైనే ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.వెయ్యి వరకు పెరిగి రూ.65,000ను క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ 1750 డాలర్ల దిశగా వెళ్తోంది. సిల్వర్ 25 డాలర్లు క్రాస్ చేసింది. బంగారం ధరలు గతవారం ఏడాది కనిష్టానికి పడిపోగా, నేడు నెల రోజుల గరిష్టాన్ని తాకాయి.

ఎంసీఎక్స్‌లో...
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.241.00 (0.53%) పెరిగి రూ.45,590.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,420.00 ప్రారంభమైన ధర, రూ.45,658.00 గరిష్టాన్ని, రూ.45,420.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.232.00 (0.51%) పెరిగి రూ.45851.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,805.00 ప్రారంభమైన ధర, రూ.45,905.00 గరిష్టాన్ని, రూ.45,785.00 కనిష్టాన్ని తాకింది.

వెండి భారీగా జంప్
వెండి ధరలు భారీగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.966.00 (1.50%) పెరిగి రూ.65528.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,150.00 వద్ద ప్రారంభమై, రూ.65,750.00 గరిష్టాన్ని, రూ.64,927.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,062.00 (1.62%) పెరిగి రూ.66476.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,817.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,648.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,817.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. 4.30 (0.25%) డాలర్ల వద్ద ఉంది. 4.30 (0.25%) డాలర్లు పెరిగి 1,733.10 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,728.25 - 1,739.45 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. ఓ సమయంలో 25 డాలర్లను క్రాస్ చేసింది. 0.197 (0.79%) డాలర్లు తగ్గి 24.977 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.800 - 25.253 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications