బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 5) స్వల్పంగా తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. రెండు సెషన్లలో రూ.1,000 పెరిగిన ధర ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర 0.72 శాతం లేదా రూ.329 తగ్గి రూ.45,478 పలికింది. వెండి ధర కిలో 0.26 శాతం తగ్గి రూ.41,137 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. వివిధ దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను సులభతరం చేస్తున్నారు. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గుతోంది. అదే సమయంలో అమెరికా - చైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. దీంతో ఔన్స్ బంగారం గ్లోబల్ మార్కెట్లో 1,700 డాలర్ల వరకు పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ ఔన్స్ 0.1 శాతం తగ్గి 764.91, వెండి 0.2 శాతం తగ్గి 14.81 పలికింది.

పెరిగిన పెట్టుబడులు
మరోవైపు బంగారంపై పెట్టుబడులు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ వద్ద 0.4 శాతం పెరిగి 1,071.71 టన్నులకు పెరిగింది. శుక్రవారం ఇది 1,067.90 టన్నులుగా ఉంది. మరోవైపు లాక్ డౌన్ ఆంక్షలను వివిధ దేశాలు క్రమంగా సడలిస్తోన్న నేపథ్యంలో అమెరికా డాలర్ బంగారం లాభాలను అధిగమించవచ్చునని అంచనా వేస్తున్నారు.

సోమవారం మిశ్రమ ధోరణి
బంగారం, వెండి ధరలు సోమవారం మిశ్రమ ధోరణిని చూపాయి, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు తగ్గుముఖం పట్టగా, బంగారం లాభపడింది. యూఎస్ ఫ్యాక్టరీ ఆర్డర్స్, డేటా, అంతర్జాతీయంగా ఈక్విటీలు బలహీనపడటంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. కానీ వెండి ధర మాత్రం నిన్న తగ్గింది.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications