ఆల్‌టైం గరిష్టం నుండి రూ.21 శాతం తగ్గిన బంగారం ధరలు: రూ.45,000 దిగువనే..
ముంబై: బంగారం ధరలు నేడు (మార్చి 23, 2021 తగ్గాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. చివరి సెషన్లో మాత్రం స్వల్పంగా లాభపడినప్పటికీ, నేడు మళ్లీ పతనమయ్యాయి. బంగారం రూ.44,600 దిగువన ఉంది. వెండి రూ.900 వరకు క్షీణించి రూ.66,700 దిగువన ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నేడు పసిడి ధరలు 1700 డాలర్ల స్థాయికి తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) లో పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.12000 వరకు తక్కువగా ఉంది. ఆల్ టైమ్ గరిష్టం నుండి ఇప్పటికీ 21 శాతం క్షీణించాయి.

రూ.12 వేలు తక్కువ
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (శుక్రవారం, మార్చి 12) మధ్యాహ్నం సెషన్లో రూ.44,600 దిగువకు వచ్చింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.333.00 (-0.74%) తగ్గి రూ.44,546.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,741.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,772.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,508.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 వరకు తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.303.00 (-0.67%) తగ్గి రూ.44885.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,112.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,112.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,860.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.67,000 దిగువకు
వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.868.00 (-1.29%) తగ్గి రూ.66677.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,259.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,420.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.870.00 (-1.27%) తగ్గి రూ.67705.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,335.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,335.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,544.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 డాలర్ల స్థాయికి..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు తగ్గాయి. అయినప్పటికీ 1700 డాలర్లకు పైనే ఉన్నాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 17.30 (-1.00%) డాలర్లు తగ్గి 1705.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,705.10 - 1,726.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువనే ఉంది. ఔన్స్ ధర -0.440 (-1.68%) డాలర్లు తగ్గి 25.753 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.655 - 26.238 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications