ముంబై: బంగారం, వెండి ధరలు నేడు (ఫిబ్రవరి 10, బుధవారం) స్వల్పంగా తగ్గాయి. ఉదయం సెషన్లో ఓ సమయంలో రూ.400కు పైగా పెరిగిన బంగారం ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం సెషన్‌కు అతి స్వల్పంగా తగ్గి లేదా దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా దాదాపు రూ.300 పెరిగినప్పటికీ, సాయంత్రం సెషన్‌కు రూ.900 వరకు తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8300 వరకు తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79000తో రూ.10వేలకు పైగా తక్కువగా ఉంది.

బంగారం 48,000 దిగువకు
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో పెరిగినప్పటికీ, సాయంత్రం సెషన్‌కు రూ.23.00 (0.05%) తగ్గి రూ.47,925.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,374.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,822.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8300 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.36.00 (-0.07%) తగ్గి రూ.48,024 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,231.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,485.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,002.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.69,000 దిగువకు
వెండి ధర తగ్గి, రూ.69వేల దిగువకు చేరింది. చేరుకుంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 916.00 (1.31%) తగ్గి రూ.68,780.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,940.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,999.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,404.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.827.00 (1.17 శాతం) తగ్గి రూ.69951.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,931.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,086.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,552.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1840 డాలర్ల వద్ద పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. అయితే ఉదయం కంటే క్షీణించి, 1840 డాలర్ల వద్ద ఉంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.60 (+0.14%) డాలర్లు పెరిగి 1840.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,834.50 - 1,856.45 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.76 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. ఔన్స్ ధర -0.437 (-1.59%) డాలర్లు పెరిగి 26.965 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.900 - 27.595డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.330 శాతం పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!



Click it and Unblock the Notifications