మూడో రోజు తగ్గిన బంగారం ధర, వరుసగా తగ్గడానికి కారణాలివే
బంగారం ధరలు వరుసగా మూడో రోజు (ఏప్రిల్ 7) తగ్గాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.30 తగ్గి రూ.45,340 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం రూ.426 డిపోయింది. నిన్నటి సెషన్‌లో లాభపడిన కిలో వెండి ఫ్యూచర్స్ మాత్రం ఈ రోజు 0.1 తగ్గి రూ.41,803 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి ఔన్స్ 1,690.19 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్‌లో 1% తగ్గింది.

బంగారంపై ఒత్తిడి ఎందుకు లేదంటే
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయంగా మార్కెట్లు కాస్త పుంజుకుంటుండటం వంటి వివిధ కారణాలతో బంగారంపై ఒత్తిడి తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. అయినప్పటికీ బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుతున్నాయి. డాలర్ బలంపై ఆధారపడటం కూడా మరో కారణం. అందుకే బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. డాలర్ బలపడుతుండటంతోపాటు ఎన్నో రిఫైనరీలు ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తున్నాయి. సరఫరా, ఉత్పత్తి సమస్యలు తగ్గే అవకాసముంది. ఈ ప్రభావం కూడా ఉంది.

ధర ఎక్కడ ఉండవచ్చునంటే..
ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు రూ.45,000 నుండి రూ.45,800 రేంజ్‌లో కదలాడవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధర కిలో రూ.41,500 వద్ద మద్దతు ధర ఉండవచ్చునని, రూ.42,500 వద్ద ప్రతిఘటన ఎదుర్కొంటుందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 1670 డాలర్ల నుండి 1700 డాలర్ల మధ్య కదలాడవచ్చునని భావిస్తున్నారు.

మిగతా ఖరీదైన లోహాలు...
అంతర్జాతీయ మార్కెట్లో మిగతా అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్‌కు 1.3 శాతం పెరిగి 758.54 డాలర్లు పలికింది. వెండి 0.3 శాతం పెరిగి 14.96 డాలర్లు పలికింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 100.25 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications