Gold prices వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధరలు.. కానీ
బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గుముఖం పట్టాయి. అయినా రూ.50,000 మార్కుకు పైనే ఉన్నాయి. అంతకుముందు భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గాయి. ఇరవై రోజుల క్రితం రూ.47,500 స్థాయికి వచ్చిన గోల్డ్ ఫ్యూచర్ ఇప్పుడు రూ.50,000పైకి చేరింది. బ్రిటన్‌లో కొత్త వైరస్ కలకలంతో ఇటీవల రూ.51,000 సమీపానికి చేరింది. అయితే ఆ తర్వాత తగ్గముఖం పడుతోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6000 తక్కువగా ఉంది. వెండి మాత్రం పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79000తో రూ.11,000కు పైగా తక్కువగా ఉంది.

బంగారం స్వల్ప తగ్గుదల
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా రూ.-13.00 (-0.03%) క్షీణించి రూ.50,136.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,151.00 వద్ద ప్రారంభమై, రూ.50,162.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,067.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.72.00 (-0.14%) తగ్గి రూ.50077.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,151.00 వద్ద ప్రారంభమై, రూ.50,162.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,067.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ ఫ్యూచర్స్ జంప్
వెండి ఫ్యూచర్ మాత్రం పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 94.00 (0.14%)
పెరిగి 67670.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,701.00 వద్ద ప్రారంభమై, రూ.67,720.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,440.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.233.00 (0.34%) 68619.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,600.00 వద్ద ప్రారంభమై, రూ.68,619.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,600.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడ రెండూ జంప్
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.35 (+0.02%) పెరిగి 1,878.45 డాలర్లు పలికింది. 1,875.25 - 1,884.30 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 22.9% పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్ 0.001 (0.00%) డాలర్లు పెరిగి 25.922 డాలర్లు తాకింది. నేటి సెషన్లో 25.690 - 26.052 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 44.28% పెరిగింది.


Click it and Unblock the Notifications