గత వారం బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఇక, ఆగస్ట్ నెలలో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి రూ.52,001 పలికింది. సెప్టెంటర్ సిల్వర్ ఫ్యూర్స్ కిలో 1 శాతం తగ్గి రూ.66,954 పలికింది. గత వారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయితే ఈ నెల ప్రారంభం నుండి కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆగస్ట్ 7న గరిష్ట రికార్డు నుండి భారీగానే తగ్గింది.

రూ.4000 తగ్గిన పసిడి ధర
ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధర 10 గ్రాములు రూ.56వేల కంటే పైకి చేరుకుంది. శుక్రవారం రూ.52,000కు కాస్త పైన పలికింది. అంటే ఈ నెల గరిష్టం నుండి రూ.4,000 కంటే ఎక్కువగా ధర తగ్గింది. పసిడి ధరలపై కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు డాలర్ వ్యాల్యూ, అంతర్జాతీయ మార్కెట్లు, ఫెడ్ నిర్ణయాలు, అమెరికా-చైనా ట్రేడ్ వార్, భౌగోళిక పరిస్థితులు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు ప్యాకేజీపై కూడా ఆధారపడి ఉంటుంది.

రూ.50,000 వద్ద కొనుగోళ్లు
అమెరికా మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశముందని, మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునే దిశగా అడుగులు వేస్తోందని, ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా రూ.50,000 స్థాయికి పడిపోతే కొనుగోళ్లు జరపవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఈ వారం కూడా ధరలు పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే కరోనా పెరుగుదల, ఈక్విటీ మార్కెట్ వంటి ప్రభావాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్
అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,942 డాలర్లకు పడిపోయింది. ఈ వారంలో ఓ దశలో తిరిగి 2,000 డాలర్లకు చేరుకొని, మళ్లీ పడిపోయింది. అమెరికా ఆర్థిక ప్యాకజీ, డాలర్, రియల్ ఎస్టేట్ సహా వివిధ అంశాల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై పడింది. శుక్రవారం నాస్‌డాక్, ఎస్ అండ్ పీ రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications