2021లో 11 శాతం తగ్గుదల: రూ.44,800కు దిగువన పసిడి, వెండి మాత్రం జంప్
ముంబై: బంగారం ధరలు నేడు (గురువారం, మార్చి 4) కూడా క్షీణించాయి. అమెరికా బాండ్ యీల్డ్స్ పెరిగిన నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గింది. ఈ వారంలో దాదాపు ప్రతి సెషన్లోను ఈ అతివిలువైన లోహం ధర తగ్గుతోంది. నేడు ఏకంగా రూ.44,800 దిగువకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.44,500 సమీపంలో కూడా ట్రేడ్ అయింది. కేవలం ఈ 2021 కొత్త సంవత్సరంలోనే పసిడి ధరలు రూ.11 శాతం మేర తగ్గాయి. తాజా తగ్గుదలతో ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ఫ్యూచర్ రూ.11,500 వరకు తక్కువగా ఉంది.

రూ.44,800 దిగువకు పసిడి
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (గురువారం, మార్చి 4) సాయంత్రం సెషన్లో రూ.45,000 దిగువనే ట్రేడ్ అయింది. ఏ సమయంలోను 45,000 కనీసం తాకలేదు. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.210.00 (-0.47%) తగ్గి రూ.44,738.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,735.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,962.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,566.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.203.00 (-0.45%) తగ్గి రూ.44,909 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,965.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,130.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,797.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి మాత్రం జంప్
నిన్న తగ్గిన వెండి ధరలు నేడు మాత్రం పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.536.00 (0.81%) పెరిగి రూ.66,649.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,437.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,649.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,293.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. కిలో రూ.699.00 (1.03%) తగ్గి రూ.67301.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,526.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,740.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1715 డాలర్ల దిగువకు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గాయి. 1715 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -1.80 (0.10%) డాలర్లు తగ్గి 1714.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,703.70 - 1,721.40
డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 27 డాలర్ల దిగువనే ఉంది. ఔన్స్ ధర -0.122 (-0.46%) డాలర్లు తగ్గి 26.265 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.665 - 26.380 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications