Gold prices today: తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు నేడు ప్రారంభంలో స్వల్పంగా పెరిగాయి. అయితే అతి స్వల్పమే. నేటి సెషన్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24 లాభపడి రూ.51,395 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48 క్షీణించి రూ.66,669 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.138 లాభపడి రూ.66,060 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.93 లాభపడి రూ.66,851 వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5000 వరకు తక్కువగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 6 డాలర్లు క్షీణించి 1921 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.142 డాలర్లు క్షీణించి 24.392 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1927 డాలర్ల వద్ద, సిల్వర్ 24.534 డాలర్ల వద్ద ముగిసింది. ఇటీవల రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టానికి (2075 డాలర్లు) సమీపానికి (2060 డాలర్లు) చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గి ఇప్పుడు 155 డాలర్ల వరకు తక్కువగా ఉంది.

బంగారం ధరలపై అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడితే మన వద్ద ధరలు పెరుగుతాయి. రూపాయి బలపడితే మాత్రం మన వద్ద కాస్త తగ్గుముఖం పడతాయి. బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో రూ.51,500 దిగువకు పడిపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వారం రూ.50,000 స్థాయికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications