Gold Price Today: పెరిగిన బంగారం ధర, రూ.49,300కు దిగువనే...
ముంబై: బంగారం ధరలు ఈ వారం రూ.50,000 దిగువకు వచ్చాయి. ఈ వారంలో పసిడి ధరలు దాదాపు రూ.1,000 వరకు తగ్గాయి. పదిహేను రోజుల క్రితం రూ.48వేల దిగువకు వచ్చిన పసిడి, ఆ తర్వాత గతవారం రూ.50వేల పైకి చేరుకుంది. ఇప్పుడు రూ.49,300 వద్ద కదలాడుతోంది. ఫైజర్ కరోనా వ్యాక్సీన్‌కు అనుమతుల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గి క్షీణిస్తున్నాయి. వ్యాక్సీన్ వస్తుందనే వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు.

పెరిగిన బంగారం ధరలు
ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరుగుదలతో ముగిశాయి. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.213.00 (0.43%) పెరిగి రూ.49290.00 వద్ద క్లోజ్ అయింది. రూ.49,150.00 ప్రారంభమైన ధర, రూ.49,438.00 గరిష్టాన్ని, రూ.48,875.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6900 తక్కువగా ఉంది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.177.00 (0.36%) ఎగిసి రూ.49330.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,253.00 వద్ద ప్రారంభమై, రూ.49,505.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,955.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

తగ్గిన వెండి ధర
సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ79,000తో రూ.15000కు పైగా తక్కువగా ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70.00 (0.11%) తగ్గి రూ.63600.00 వద్ద ముగిసింది. రూ.63,935.00 గరిష్టాన్ని, రూ.62,700.00 కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.82.00 (-0.13%) తగ్గి రూ.64514.00 వద్ద ముగిసింది. రూ.64,801.00 గరిష్టాన్ని, రూ.63,635.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 6.30 (+0.34%) పెరిగి 1,843.70 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. సెషన్లో 1,827.25 - 1,851.75 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 23.12% పెరిగింది. కామెక్స్‌లో బంగారం పెరగగా, వెండి ధరలు తగ్గాయి. 0.016
(-0.07%) డాలర్లు తగ్గి 24.078 డాలర్ల వద్ద ముగిసింది. సెషన్లో 23.703 - 24.242 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.65% పెరిగింది.


Click it and Unblock the Notifications