బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూ దేశాలను వణికిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. గత మార్చి నెలలో బంగారం ధరలు రూ.45వేల రికార్డ్ దాటింది. అదే సమయంలో రూ.40వేల దిగువకు కూడా చేరుకుంది.

వరుసగా పెరుగుదల.. రూ.50 వేల మార్క్
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతున్నాయి. వరుసగా ఆరో రోజు పెరిగాయి. ముంబై బులియన్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ.45,201గా ఉన్న ధర నేడు మరింత పెరిగింది. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు రూ.50,000 మార్క్‌కు చేరుకుంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

10 రోజుల్లో రూ.1,700 పెరిగిన ధర
ఏప్రిల్ నెలలో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పది రోజుల్లో ధరలు దాదాపు రూ.1,700 పెరిగింది. ఉదాహరణకు ఏప్రిల్ 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,030గా ఉండగా ఏప్రిల్ 11 (నేడు) రూ.42,755కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏప్రిల్ 2 రూ.42,030 ఉండగా నేడు రూ.43,755కు చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.3,000కు పైగా పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లోను..
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర భారీగా పెరుగుతోంది. జూన్ ఫ్యూచర్స్ న్యూయార్క్‌లోని కామెక్స్‌లో 4 శాతానికి పైగా పెరిగి 1754.50 డాలర్లకు చేరుకుంది. ఇది అక్టోబర్ 2012 ముగింపు ధర. వారంలో బంగారం ధర 6.5 శాతం పెరిగింది.

వచ్చే వారం భారీగా పెరిగే అవకాశం
వచ్చే వారంలో మాత్రం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,780 డాలర్లకు పెరిగే అవకాశముందని కమొడిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఔన్స్‌కు 1,754 డాలర్లకు చేరుకొని ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయని, వచ్చే వారం ఈ ధరలు 1,780 డాలర్లకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అనుజ్ గుప్తా అన్నారు.

కళ్లముందు 2008 సంక్షోభం
కరోనా మహమ్మారి ఈక్విటీ మార్కెట్లను అతలాకుతలం చేస్తోందని, దీంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా భావిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారమే బెట్టర్ అని వారు భావిస్తున్నారన్నారు. 2008-09 ఆర్థిక సంక్షోభం ఇన్వెస్టర్ల కళ్ళముందే కదలాడుతోందని గుర్తు చేస్తున్నారు. ఇన్వెస్టర్లు ప్రధానంగా బంగారం వైపు, అమెరికా డాలర్ వైపు చూస్తున్నారన్నారు.

ఇండియాలో నెల రోజుల్లో రూ.47,500
ఎంసీఎక్స్ బంగారం ధరలు ప్రస్తుతం రూ.45,000 పైకి చేరుకున్నాయని, నెల రోజుల్లో ఈ ధరలు రూ.47,000 నుండి రూ.47,500 మధ్య ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అమిత్ అన్నారు. అయితే, కరోనా ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి మీద బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications