బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. వెండి రూ.1,000 జంప్
ముంబై: బంగారం ధరలు భారీగా పెరిగాయి. బ్రిటన్ వంటి దేశాల్లో కొత్త వైరస్ కేసుల నమోదు, పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లోను ప్రారంభంలో ధరలు పెరిగినా, ఆ తర్వాత స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి చాలా రోజుల తర్వాత 1900 డాలర్లు దాటింది. అయితే ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.50వేలకు పైనే ఉంది.

బంగారం ధర జంప్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 230.00 (0.46%) రూ.50,534.00 పెరిగి రూ.50534.00 వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.50,515.00 వద్ద ప్రారంభమై, రూ.51,009.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,712.00 కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.231.00 (0.46%) పెరిగి రూ.50580.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,746.00 వద్ద ప్రారంభమై, రూ.51,083.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,756.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.70వేలు క్రాస్
ఎంసీఎక్స్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 1,118.00 (1.65%) పెరిగి రూ.69025.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,958.00 వద్ద ప్రారంభమై, రూ.71,650.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,604.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,374.00 (2.00%) పెరిగి రూ.70030.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,674.00 వద్ద ప్రారంభమై, రూ.72,482.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,662.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
ఇక, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా క్షీణించాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.95 (-0.10%) డాలర్లు తగ్గి 1,886.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,859.40 - 1,911.70 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 26.28 శాతం పెరిగింది.సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 0.354 (+1.36%) డాలర్లు పెరిగి 26.387 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 25.145 - 27.617 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 54.16 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications