Gold prices today: నాటి నుండి రూ.4000 తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నేడు (మార్చి 21, సోమవారం) గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు అతి స్వల్పంగా తగ్గాయి లేదా దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.34 క్షీణించి రూ.51,413 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.18 తగ్గి రూ.51,780 వద్ద ట్రేడ్ అయింది. క్రితం వారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,500 దిగువన ముగిసింది. ఇప్పుడు అదే స్థాయిలో ఉంది. ఓ సమయంలో రూ.55,000 క్రాస్ చేసిన పసిడి, గతవారం రూ.4000 వరకు తగ్గింది. ఈవారం మరికాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. గతవారం రూ.68,000 దిగువన ముగిసిన సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.68,000 పైన ప్రారంభమయ్యాయి. నేటి ప్రారంభ సెషన్‌లో మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.195 పెరిగి రూ.68,071 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.116 క్షీణించి రూ.68,845 వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రూ.72,000 క్రాస్ చేసిన సిల్వర్ ఇప్పుడు రూ.68,000 స్థాయిలో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1,928.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,929 డాలర్ల వద్ద ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు అతి స్వల్పంగా తగ్గింది. నేడు 1,918.55 - 1,929.40 స్థాయిలో కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాస్త పెరిగి 25.212 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 25.047 - 25.293 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications