భారీగా తగ్గిన బంగారం ధర, రూ.500కు పైగా డౌన్: రూ.1000 తగ్గిన వెండి ధర
బంగారం ధరలు గురువారం భారీగా పడిపోయాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.569(1.11 శాతం) తగ్గి రూ.50,764 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు పసిడి ధర రూ.51వేలకు పైన ముగిసిన విషయం తెలిసిందే. నిన్న క్షీణించింది. ఫ్యూచర్ మార్కెట్లో రూ.51,199 వద్ద ప్రారంభమైంది. గరిష్టం ఇదే. కనిష్టం రూ.50,535 పలికింది. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికింది. గరిష్ట ధరతో రూ.5,500 తక్కువగా ఉంది.

రూ.600 తగ్గిన పసిడి
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.550కి పైగా క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.466 (0.91 శాతం) తగ్గి రూ.50,920 వద్ద ముగిసింది. రూ.51,226 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,298 వద్ద గరిష్టాన్ని, రూ.50,687 వద్ద కనిష్టాన్ని తాకింది. మొత్తానికి ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు రూ.500 వరకు తగ్గాయి. ఓ సమయంలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.600కు పైగా క్షీణించింది.

రూ.1200 తగ్గిన వెండి
ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్ కిలో రూ.931.00(1.46%) క్షీణించి రూ.62,698 వద్ద ముగిసింది. రూ.63,111.00 ప్రారంభమైన ధర, రూ.63,250.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,856.00 కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.1,004 (1.54 శాతం) క్షీణించి రూ.63,303 వద్ద ముగిసింది. రూ.64,589.00 వద్ద ప్రారంభమైన సిల్వర్ ఫ్యూచర్స్ రూ.64,901.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,593.00 కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో రూ.1300కు పైగా కూడ తగ్గింది.

అక్కడా భారీగా తగ్గిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు నిన్న రాత్రి సమయం వరకు భారీగా క్షీణించాయి. కామెక్స్‌లో 1.38 శాతం క్షీణించిన ధర ఔన్స్ 1,902 డాలర్లు పలికింది. నిన్న 1,929.50 డాలర్ల వద్ద క్లోజ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు 1,928.10 వద్ద ప్రారంభమైంది. 1,895.75 - 1,929.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత 1905 డాలర్లకు పెరిగింది.
వెండి ఫ్యూచర్స్ కూడా 2.18 శాతం క్షీణించి ఔన్స్ 24.690 డాలర్లు పలికింది. 25.180 డాలర్ల వద్ద ప్రారంభమైన వెండి ఫ్యూచర్స్ 24.465 - 25.215 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. నిన్న 24.241 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications