బంగారం ధరలు నేడు భారీగా క్షీణించాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీపావళి-ధనతెరాస్ పండుగ సమయంలో పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. ఈ పండుగ సమయంలో బంగారం కొనుగోలు సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఇటీవలి వరకు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం రూ.48,000 స్థాయిలో ఉంది. ఈ వారం కాస్త తగ్గింది. అయినప్పటికీ నేటి వరకు రూ.47,500 వద్ద ఉంది. కానీ సాయంత్రానికి మరికాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. నేటి(నవంబర్ 3, బుధవారం) సాయంత్రం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.500కు పైగా తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9,100 వరకు తక్కువగా ఉంది.

రూ.500 తగ్గుదల
నేటి సాయంత్రం సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.537.00 (-1.13%) తగ్గి రూ.47085.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.524.00 (-1.10%) తగ్గి రూ.47226.00 వద్ద ట్రేడ్ అయింది. బంగారం చాలా రోజులకు రూ.47000 స్థాయికి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1770 డాలర్ల దిగువకు పడిపోయాయి. నేడు ఒక్కరోజే 20 డాలర్లకు పైగా క్షీణించింది. కామెక్స్‌లో 21.40 (-1.20%) డాలర్లు క్షీణించి 1,768.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,767.15 - 1,789.25 డాలర్ల మధ్య కదలాడింది. క్రితం సెషన్‌లో బంగారం 1789 డాలర్ల వద్ద ముగిసింది.

సిల్వర్ రూ.900 డౌన్
సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ నేటి సాయంత్రం సెషన్‌లో రూ.902.00 (-1.43%) తగ్గి రూ.62321.00 వద్ద ట్రేడ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.976.00 (-1.53%) క్షీణించి రూ.63000.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.17,000 వరకు తక్కువగా ఉంది. ఇక అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ స్వల్పంగా తగ్గి 23 డాలర్ల స్థాయికి వచ్చింది. సాయంత్రం సెషన్‌లో 0.385 (-1.64%) డాలర్లు తగ్గి 23.122 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 23.420 - 23.663 డాలర్ల మధ్య కదలాడింది.

మద్దతు ధర
కామెక్స్‌లో బంగారం ప్రస్తుతం 1770 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. బంగారం మద్దతు ధర 1764-$1760 డాలర్లు, నిరోధకస్థాయి 1806.07-$1812.33 డాలర్లు. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 వద్ద ఉంది. మద్దతు ధర రూ.47,000-46,850. నిరోధకస్థాయి రూ.47,500-47,650.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications