బంగారం కొంటున్నారా: గుడ్‌న్యూస్: స్వల్పంగా తగ్గిన పసిడి..వెండి: పూర్తి వివరాలివే
ముంబై: పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఎల్లో మెటల్ రేట్లు తగ్గుతున్నాయి. దీనితో పాటు వెండి ధరలు కూడా. ఇవ్వాళ ఈ రెండింటి ధరలు తగ్గాయి. ప్రస్తుతానికి ఈ తగ్గుదల స్వల్పమే..నామమాత్రమే. అయినప్పటికీ- మున్ముందు మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలను పంపించినట్టయింది. గురువారం బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు తగ్గాయి. వేర్వేరు నగరాల్లో వేర్వేరు రేట్లు నమోదయ్యాయి.

బంగారంలో 98 రూపాయలు తగ్గుదల
అంతర్జాతీయంగా మార్కెట్ ఇవ్వాళ ప్లాట్‌గా ముగిసింది. అమెరికన్ కోమెక్స్ ట్రేడింగ్‌లో బుధవారం నాటితో పోల్చి చూస్తే ఔన్స్ బంగారం 1,799 డాలర్లు పలికింది. వెండి 22.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దీని ప్రభావం ఇండియన్ బులియన్ మార్కెట్‌పై పడింది. ఒక రకంగా ఫ్లాట్‌గా ముగిసింది. స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 98 రూపాయల మేర తగ్గింది. వెండి ధర కేజీ ఒక్కింటికి 699 రూపాయల మేర క్షీణించింది.

వెండిలో 699 రూపాయలు...
దేశీయ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 46,688 రూపాయలు పలికింది. బుధవారం 46,786 రూపాయలుగా నమోదైంది. 98 రూపాయల మేర క్షీణత కనిపించింది. వెండి కేజీ 60,723 రూపాయలుగా నమోదు కాగా.. ఇవ్వాళ దీని ధర కూడా స్వల్పంగా తగ్గింది. 699 రూపాయలు తగ్గి- కేజీ ఒక్కింటికి 60,024 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఇదివరకు 48,000 రూపాయల బెంచ్‌మార్క్ వరకు పైన ఉన్న గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్ కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోంది.

అమ్మకాలు..
రిస్క్ ఆన్ సెంటిమెంట్ వల్ల బంగారం ధరల్లో అమ్మకాలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ పేర్కొన్నారు. యూఎస్ బాండ్స్ వేల్యూ కొంతకాలంగా క్రమంగా పెరుగుతోందని, డాలర్ మరింత బలోపేతమౌతోందని, దీని ప్రభావం కోమెక్స్ ట్రేడింగ్‌పై పడినట్లు విశ్లేషించారు. బంగారం అమ్మకాలు పెరిగడం వల్ల బులియన్ మార్కెట్ కొంత ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. బంగారం ధరలో క్షీణత మరింత ఉండొచ్చని అన్నారు.

2022 సెకెండ్ ఆఫ్‌లో మళ్లీ.. జూమ్
2022 ద్వితీయార్థంలో బంగారం ధర భారీగా పెరగొచ్చని తపన్ పటేల్ అంచనా వేశారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 55,000 రూపాయలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఈ రెండు సంవత్సరాల్లో పసిడి ధర భారీగా పెరిగిందని గుర్తు చేశారు. ఆ తరువాత తగ్గినా.. భవిష్యత్ మాత్రం ఈ ఎల్లో మెటల్‌దేనని స్పష్టం చేశారు. 2022 జూన్ నుంచి బంగారం ధరలు అంచనాలకు మించిన స్థాయిలో పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు.

గత ఏడాది తరహాలో..
గత సంవత్సరం కోవిడ్ వైరస్ ఫస్ట్ వేవ్ సమయంలో 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా 56,200 రూపాయలకు చేరింది. ఈ ఏడాది ఆ స్థాయిలో ఎక్కడా దాని రేటు పెరగలేదు. షేర్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల బంగారంపై పెద్దగా దృష్టి పడలేదు.. ఇన్వెస్టర్లకు. ఈ దఫా ఆ పరిస్థితి ఉండకపోవచ్చని, మళ్లీ 55 వేలకు చేరుకుంటుందని తపన్ పటేల్ చెప్పారు. షేర్ మార్కెట్‌కు ధీటుగా బంగారంలోనూ ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా ఉంటాయని అన్నారు.


Click it and Unblock the Notifications