Gold Price Today: ఊరట... భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఫ్యూచర్ మార్కెట్లో నేడు ఏకంగా రూ.500 వరకు క్షీణించాయి. ఓ సమయంలో దాదాపు రూ.700 క్షీణించాయి. దేశీయంతో పాటు అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,600 దిగువనే ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,000 స్థాయిలో ఉంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9700 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12000కు పైగా తక్కువగా ఉంది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కంపెనీ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.3 శాతం పెరిగి 1045.78 టన్నులకు చేరుకున్నాయి.

భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.437.00 (-0.93%) తగ్గి రూ.46571.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,880.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,970.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,330.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.410.00 (-0.87%) తగ్గి రూ.46878.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,223.00 గరిష్టాన్ని, రూ.46,650.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలూ తగ్గాయ్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.859.00 (-1.26%) తగ్గి రూ.67282.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,869.00 వద్ద ప్రారంభమై, రూ.68,145.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.66,678.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.936.00 (-1.35%) తగ్గి రూ.68297.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,947.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,130.00 గరిష్టాన్ని, రూ.67,700.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లోనూ
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు భారీగా తగ్గాయి. ఏకంగా 1770 డాలర్ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 18.35 (1.03%) డాలర్లు తగ్గి 1,762.35 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,750.20 - 1,779.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.336 (1.28%) డాలర్లు పెరిగి 25.887 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.608 - 26.210డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications