బంగారం ధరలు గతవారం చివరి సెషన్‍లో స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తంగా దాదాపు 3 శాతం పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి ధర (ఫిబ్రవరి ఫ్యూచర్స్) గతవారం రూ.49,209 వద్ద ముగిసింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.49,225 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1,842.10 డాలర్లు, వెండి ఫ్యూచర్స్ ఔన్స్ 24.315 డాలర్ల వద్ద ముగిసింది.

బంగారం ధర ఎంత పెరిగిందంటే
గతవారం మొత్తంగా పసిడి ధరలు 2.66 శాతం మేర పెరిగాయి. అంతకుముందు మూడు వారాలు ధరలు తగ్గాయి. రూ.52వేలకు పైగా ఉన్న పసిడి అంతకుముందు వారం రూ.48వేల దిగువకు వచ్చింది. గతవారం రూ.49వేల పైకి చేరుకుంది. వారంలో 2.66 శాతం పెరిగింది. గత వారం మొదటి నాలుగు వారాలు పెరిగిన పసిడి చివరి సెషన్‌లో అమెరికాలో అదనపు ఉద్దీపన ప్యాకేజీ, డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం దాదాపు స్థిరంగా ఉంది.
వెండి ధర మాత్రం క్రితం సెషన్లో రూ.218 పెరిగి రూ.63,848.00కు చేరుకుంది. అంతకుముందు వారంలో రూ.59వేలకు దిగి వచ్చిన పసిడి ఇప్పుడు రూ.64,000 సమీపానికి చేరుకుంది. ఇక, ఈ వారం ప్రీమియం ట్రాయ్ ఔన్స్‌కు 3.5 డాలర్లు క్షీణించింది.

అమెరికాలో పేరోల్స్ ఇలా..
అమెరికాలో పేరోల్స్ నవంబర్ నెలలో 245000 పెరిగాయి. వరుసగా ఆరు నెలలు క్షీణించిన అనంతరం అక్టోబర్ నెలలో 6,10,000 పెరిగాయి. క్రితం సెషన్లో సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ 0.09 శాతం పెరిగి 90.79 వద్ద నిలిచింది. అయితే వారం మొత్తంలో 1.21 శాతం పెరిగింది. ఈ ప్రభావం బంగారంపై పడింది. నవంబర్ నెలలో భారీగా తగ్గిన పసిడి ధరలు డిసెంబర్ మొదటి వారంలో మాత్రం పెరిగాయి. నవంబర్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 6 శాతం క్షీణించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత ధర అంటే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రూ.50వేలకు పైగా ఉన్నాయి. విశాఖ, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో 24 క్యారెట్ల బంగాం రూ.50,080 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.45,910 పలికింది. ఢిల్లీలో డిసెంబర్ ప్రారంభంలో పెరిగిన బంగారం ధరలు తాజాగా కాస్త దిగి వచ్చాయి. బంగారం ధర నేడు రూ.200 వరకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.52,600గా, 22 క్యారెట్ల బంగారం రూ.48,060గా ఉంది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications