For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగకు ముందు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, వెండిదీ అదే దారి

|

బంగారం, వెండి ధరలు ఫ్యూచర్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 21) భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజు రూ.500 వరకు పెరిగి పండుగ సీజన్ ప్రారంభంలో కొనుగోలుదారులకు షాకిచ్చింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.470 (0.92 శాతం) పెరిగి రూ.51,380 పలికింది. ఉదయం రూ.50,950 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,454 వద్ద నేటి గరిష్టాన్ని, రూ.50,915 వద్ద నేటి కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7 ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.4800 తక్కువ ఉంది. నిన్నటి వరకు రూ.5000కు పైన తక్కువ ఉంది. ఈ రోజు రూ.500 వరకు పెరగడం ప్రభావం చూపింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: 70మంది కోటీశ్వరులయ్యారు, 10,000మంది లక్షాధికారులు!!ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: 70మంది కోటీశ్వరులయ్యారు, 10,000మంది లక్షాధికారులు!!

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా రూ.51,000 దిగువన ఉన్నాయి. అయితే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో నేడు సెప్టెంబర్ 18 నాటి గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందే అమెరికా ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలుపుతుందని వార్తలు వెలువడుతున్నాయి. ఇది పసిడిపై ఒత్తిడిని పెంచింది. దీంతో డిసెంబర్ ఫ్యూచర్ రూ.470 వరకు పెరిగింది.

ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.636 (1.25 శాతం) పెరిగి 10 గ్రాములు రూ.51,568 పలికింది. రూ.51,113 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి, రూ.51,568 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.51,001 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండిదీ అదే దారి

వెండిదీ అదే దారి

వెండి ధర కూడా భారీగానే పెరిగింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ వెండి కిలో రూ.551 (0.87 శాతం) పెరిగి రూ.63,675 పలికింది. రూ.63,530.00 వద్ద ప్రారంభమై, రూ.64,070.00 గరిష్టాన్ని తాకి, రూ.63,115.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో రూ.16వేలకు పైగా తక్కువ ఉంది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్ రూ.615 (0.95 శాతం) పెరిగి రూ.65,334 పలికింది. రూ.65,085.00 వద్ద ప్రారంభమై, రూ.65,650.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.64,850.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 0.62 శాతం లాభపడి 1,927.20 డాలర్లు పలికింది. 1,909.40 - 1,935.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,915.40 క్లోజ్ అయింది. ఏడాదిలో 26 శాతానికి పైగా పసిడి ధర పెరిగింది.వెండి ఔన్స్ ఫ్యూచర్ మార్కెట్లో 0.99 శాతం పెరిగి రూ.25.227 డాలర్లు పలికింది. 24.745 - 25.422 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.980 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి ధర 40 శాతానికి పైగా ఎగిసింది.

English summary

పండుగకు ముందు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, వెండిదీ అదే దారి | Gold prices climb to highest level since September 18, at Rs 51,380

Gold prices climbed Rs 390 to Rs 51,366 per 10 gram in the Mumbai retail market on a weaker rupee and positive global cues. The precious metal settled at the highest level since September 18 in India amid growing optimism over the US stimulus package before the election.
Story first published: Wednesday, October 21, 2020, 22:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X