బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం సెషన్‌లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.1100కు పైగా తగ్గి రూ.50,700 దిగువకు, అంతర్జాతీయ మార్కెట్‌లో 1865 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇక వెండి ధరలు అయితే ఎంసీఎక్స్‌లో రూ.62,300 స్థాయికి పడిపోయాయి. నిన్న సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1250 వరకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 22.600 డాలర్ల దిగువన ముగిసింది.

భారీగా తగ్గిన బంగారం ధర
నేడు రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు రోజు. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.1,104 లేదా 2.13 శాతం క్షీణించి రూ.50650 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,099 లేదా 2.11 శాతం తగ్గి రూ.50,900 వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.5600 వరకు తక్కువగా ఉంది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్రితం సెషన్‌లో రూ.1246 లేదా దాదాపు 2 శాతం తగ్గి రూ.62,310 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1379 తగ్గి రూ.62,970 వద్ద ముగిసింది.

1865 డాలర్ల దిగువకు
కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1,863.60 డాలర్ల వద్ద ముగిసింది. నిన్న భారీగా క్షీణించింది. నేడు దాదాపు స్థిరంగా ఉంది. ఉదయం గం.9.45 సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 0.49 డాలర్లు మాత్రమే పెరిగి 1863.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.108 డాలర్లు లాభపడి 22.692 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 212 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.

అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్
బంగారం ధరలు ప్రస్తుతం రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. అక్షయ తృతీయ రోజు పసిడి కొనుగోలుకు ఎక్కువమంది మొగ్గు చూపుతారు. ఇలాంటి సమయంలో పసిడి ధర నిన్న రూ.1100కు పైగా పడిపోయి శుభవార్త ఇచ్చింది. ప్రస్తుత డిప్ సమయంలో పసిడిని లాంగ్ టర్మ్‌కు కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?



Click it and Unblock the Notifications