బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేని రికార్డ్ ధరలను నమోదు చేస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న బంగారం ధరల తీరు బంగారం ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది. గత రెండు రోజులుగా మళ్లీ వరుసగా బంగారం ధరలు ఊహించని విధంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, రూపాయి మారకం విలువ, బంగారం రిజర్వులు వంటి అనేక కారణాలు బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.
తాజాగా దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర నేడు 200రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 220రూపాయల మేర నేడు పెరిగింది. హైదరాబాద్ లో నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 57,200 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల ధర 62,400 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 57,350 రూపాయలు కాగా, 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 62,550 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర నేడు 57,200 కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 62,400 రూపాయలుగా కొనసాగుతుంది. కలకత్తాలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 57,200కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 62,400 రూపాయలుగా ట్రేడవుతోంది.
బెంగళూరులో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 57,250 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 62,450 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడింది.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 57,200రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 62,400రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, తిరునవ్వేలి, తిరుపూరు, తిరుచ్చిలలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 57,550 కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 63వేల రూపాయలకు ట్రేడవుతోంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు రికార్డును బద్దలు కొడుతూ 70వేల రూపాయల వైపు దూసుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications