పైకే చూస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా!!
భారతదేశంలో బంగారం ధరలు స్థిరత్వం లేకుండా ఒడిదుడుకులకు లోనవుతూ ఉన్నాయి. బంగారం ధరలు తగ్గితే బాగుంటుందని సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆశపడుతున్నా, బంగారం ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. మొన్న రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు, మళ్లీ ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇక నేడు కూడా బంగారం ధరలు దేశీయంగా పెరిగాయి.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 100 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 110 రూపాయల మేర బంగారం ధరలు నేడు పెరిగాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం రికార్డు స్థాయి ధరలను నమోదు చేస్తుంది.

ఇక దేశీయంగా బంగారం ధరలు చూసినట్లయితే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 55, 950 రూపాయలుగా కొనసాగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 61,040 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,190 రూపాయలుగా కొనసాగుతుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,950 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,040 రూపాయలుగా ట్రేడవుతోంది. బెంగళూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56వేల రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,100 రూపాయలుగా కొనసాగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,950 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,040 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, తిరుపూర్, తిరునవ్వేలి, తిరుచ్చిలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,400 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,530 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications