మళ్ళీ భగ్గుమంటున్న బంగారం ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా!!
బంగారం ధరలు మళ్ళీ భగ్గుమంటున్నాయి. మొన్న 60 వేలు దాటిన బంగారం ధర, నిన్న శాంతించి కాస్త తగుముఖం పట్టింది. మళ్లీ నేడు బంగారం ధర విపరీతంగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలుదారులు కొనాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో, యూఎస్ లో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా బంగారం ధరల దూకుడు కొనసాగుతుంది. ఇక తాజాగా భారత దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే నిన్నటికి ఈరోజుకి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద 600 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద 650 రూపాయల మేర పెరిగింది.

హైదరాబాద్లో, ఢిల్లీలలో బంగారం ధరలిలా
హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో నిన్న 54,200గా ఉంటే, నేడు 54,800కు ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న హైదరాబాద్ మార్కెట్లో 59 వేల 130 రూపాయలు ఉంటే నేడు 59,780 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్లో స్వచ్ఛమైన బంగారం మీద 650 రూపాయల ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,950గా ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 59,930 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

ముంబై, కలకత్తాలలో బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,800గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,780గా కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,850 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,830 రూపాయల వద్ద కొనసాగుతుంది. కలకత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,800గా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కలకత్తాలో 59,780గా ట్రేడ్ అవుతుంది.

ఏపీలో వివిధనగరాల్లో, తమిళనాడు నగరాల్లో బంగారం ధరలు
ఇక విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, కాకినాడ, తిరుపతిలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,800 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,780గా ప్రస్తుతం కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,430 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రమే కాకుండా కోయంబత్తూరు, మధురై, తిరుచ్చి, తిరునవ్వేలి, తిరుపూర్, ఈరోడ్, వేల్లూరు, సేలం లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400 గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 430 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. దేశంలోనే అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలోనే బంగారం ధరలు ఉన్నాయి. అక్కడ బంగారం ధర 60 వేల మార్కును దాటి ట్రేడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications