మళ్లీ బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తెలుగురాష్ట్రాల్లో పసిడిధరలు ఎంతగా పెరిగాయంటే!!

భారతదేశంలో బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నేడు భారతదేశంలో బంగారం ధర ఆర్నమెంట్ గోల్డ్ కు 290 రూపాయలు, 24 క్యారెట్ల బంగారానికి 330 రూపాయల మేర పెరిగింది.

భారతదేశంలో బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త తగ్గినట్టు అనిపించిన బంగారంధరలు మళ్లీ పెరుగుతున్న తీరు బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా గతనేడు భారతదేశంలో బంగారం ధర ఆర్నమెంట్ గోల్డ్ కు 290 రూపాయలు, 24 క్యారెట్ల బంగారానికి 330 రూపాయల మేర పెరిగింది.

భారత్ లో పెరుగుతున్న బంగారం ధరలు .. అంతర్జాతీయంగా ధరలిలా

భారత్ లో పెరుగుతున్న బంగారం ధరలు .. అంతర్జాతీయంగా ధరలిలా

నిన్న భారత దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,160 రూపాయలు ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 52,450 లకు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 56,890 రూపాయలు ఉంటే, నేడు 57,220 రూపాయలకు చేరి 330 రూపాయలు మేర పెరుగుదలను నమోదు చేసింది. మళ్లీ వరుసగా గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న తీరు బంగారం ధరలు మళ్ళీ పైకి ఎగబాకుతాయా అన్న ఆందోళనకు కారణంగా మారాయి . ఇక అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 1876.70 డాలర్ల వద్ద కొనసాగుతుంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 20.69 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీలలో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీలలో బంగారం ధరలు ఇలా

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,450గా కొనసాగుతుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,220 రూపాయలు గా ట్రేడ్ అవుతుంది. ఇక విశాఖపట్నం, విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,220గా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 52 వేల 600 రూపాయలుగా కొనసాగుతుంటే 24 క్యారెట్ల బంగారం ధర 57,370 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

ముంబై, చెన్నై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా

ముంబై, చెన్నై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,450 వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,220 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ సమయానికి 53,250గా విక్రయిస్తుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 58,090 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500గా కొనసాగుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,270 రూపాయలుగా కొనసాగుతుంది.

బంగారం 60 వేల మార్కు దాటుతుందా?

బంగారం 60 వేల మార్కు దాటుతుందా?

ఇక పెరుగుతున్న ధరల నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు 60 వేల మార్కును దాటుతాయా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగారం ధరలు దేశంలోని వివిధ నగరాల్లో అక్కడస్థానికంగా ఉండే పన్నులను బట్టి కాస్త తేడా ఉంటాయనే విషయం ప్రతీ ఒక్కరూ గమనించాలి. బంగారం కొనుగోలుకు సంబంధించి ట్రెండ్ ను గమనించి ఎప్పుడు కొనుగోలు చెయ్యాలి అన్న దాన్ని డిసైడ్ చేసుకుని కొనుగోలు చేసుకుంటే మంచిదని అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+