Gold price today: స్థిరంగా బంగారం ధరలు, తగ్గిన వెండి ధరలు
బంగారం ధరలు నేడు (మార్చి 25, గురువారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. డాలర్ బలపడటం, యూరోప్‌లో కరోనా లాక్ డౌన్ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల వరుసగా తగ్గుతున్న ధరల్లో నేడు మార్పులేదు. మరోవైపు అమెరికా తన నాలుగో త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 4.1 శాతం నుండి 4.3 శాతానికి మరింత సానుకూలంగా సవరించింది. ఇది బంగారం ధరల్లో కదలికకు ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేడు దేశీయ, అంతర్జాతీయ మార్కట్లో అతి స్వల్పంగా క్షీణించడం లేదా స్థిరంగా ఉన్నాయి.

స్థిరంగా బంగారం ధరలు
గోల్డ్ ఫ్యూచర్ నేడు సాయంత్రం సెషన్‌లో స్థిరంగా ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.16.00 (0.04%) తగ్గి రూ.44844.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,892.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,028.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,601.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.14.00 (-0.03%) తగ్గి రూ.45262.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,316.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45550.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,080.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

తగ్గిన వెండి
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.595.00 (-0.91%) తగ్గి రూ.64650.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,159.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,198.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,411.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.649.00 (-0.98%) తగ్గి రూ.65719.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,135 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,210 వద్ద గరిష్టాన్ని, రూ.64,402 వద్ద కనిష్టాన్ని తాకింది.

1730 డాలర్ల దిగువకు....
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -3.65 (0.21%) డాలర్లు తగ్గి 1,729.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,723.40 - 1,744.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల స్థాయికి వచ్చింది. ఔన్స్ ధర -0.173 (-0.69%) డాలర్లు తగ్గి 25.058 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.445 - 25.247 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications