Gold Price Today: కాస్త ఊరట, రూ.50,000 దిగువకు వచ్చిన బంగారం ధరలు
బంగారం ధరలు రూ.50,000 దిగువకు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం, అమెరికా డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణించిన నేపథ్యంలో గతవారం పసిడి ధరలు ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకున్నాయి. గతవారం అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో 1900 డాలర్లను, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.50,000 క్రాస్ చేసింది. అయితే ఈ వారం ప్రారంభంలోనే ధరలు కాస్త శాంతించాయి.

బంగారం ధరలు డౌన్
బంగారం ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గుముఖంతో ప్రారంభించింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.214 క్షీణించి రూ.49,898 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.208.00 క్షీణించి రూ.50090 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిగువకు వచ్చింది. నేటి సెషన్‌లో 5.70 డాలర్లు లేదా 0.30 శాతం క్షీణించి 1,894.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వెండి ధరలు
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. నేటి సెషన్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.479 లాభపడి రూ.63,423 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.411 క్షీణించి రూ.64,350 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.199 శాతం లేదా 0.83 శాతం క్షీణించి 23.793 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63,500 దిగువకు వచ్చింది. ఏడాదిలో బంగారం ధరలో 6.21 శాతం మార్పు కనిపించగా, వెండి ధర 12.7 శాతం క్షీణించింది.

మద్దతు-నిరోధకం
బంగారం ధరలు రూ.49,900 వద్ద ఉన్నాయి. రూ.50,300 టార్గెట్ ధరతో రూ.49,800 వద్ద కొనుగోలు చేయవచ్చునని, అలాగే, రూ.49,500 టార్గెట్ ధరతో రూ.49,700 వద్ద విక్రయించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.49,900-రూ.49,600. నిరోధకస్థాయి రూ.50,300-రూ.50,500. వెండి మద్దతు ధర రూ.63,420-రూ.62,950. నిరోధకస్థాయి రూ.64,300-రూ.64,700.


Click it and Unblock the Notifications