ఇక్కడ భారీగా పెరిగి, అక్కడ భారీగా తగ్గిన బంగారం ధర: వెండి రూ.1000 డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా పెరగగా, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గాయి. ఇక వెండి ధరలు దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి రూ.12,200 తక్కువగా ఉంది. అయినప్పటికీ పసిడి రూ.44,000 దిగువనే ఉంది. ఓ సమయంలో నేడు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,500కు పైగా తగ్గింది. వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో పోలిస్తే రూ.17000 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2072 డాలర్లతో దాదాపు 400 డాలర్ల వరకు క్షీణించింది.

రూ.400 పెరిగిన బంగారం
గోల్డ్ ఫ్యూచర్ నేడు (మార్చి 30, 2021) సాయంత్రం సెషన్‌లో పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.414.00 (0.95%) పెరిగి రూ.43,959.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,669.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,300.00 వద్ద గరిష్టాన్ని, రూ.43,669.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం 44,000 మార్క్ క్రాస్ చేసినప్పటికీ, సాయంత్రానికి తిరిగి తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,300 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.284.00 (0.64%) తగ్గి రూ.44414.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,590.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,740.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,108.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.వెయ్యి వరకు డౌన్
వెండి ధరలు నేడు ఉదయం సెషన్లో రూ.500 వరకు తగ్గాయి. సాయంత్రానికి రూ.వెయ్యి వరకు తగ్గింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.924.00 (1.44%) తగ్గి రూ.63250.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,976.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,185.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,066.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.931.00 (-1.43%) తగ్గి రూ.64185.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,881.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,139.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,050.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 డాలర్ల దిగువకు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. ఏకంగా 30 డాలర్ల వరకు తగ్గింది. కామెక్స్‌లో 28.40 (1.66%) డాలర్లు తగ్గి 1,686.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,678.80 - 1,714.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్ల స్థాయికి వచ్చింది. ఔన్స్ ధర 0.616 (-2.49%) డాలర్లు తగ్గి 24.155 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.543 - 24.750 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications