మూడ్రోజుల్లో రూ.2,000 తగ్గి, నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 22) స్వల్పంగా పెరిగాయి. ముంబై బులియన్ మార్కెట్‌లో రూ.492 పెరిగి రూ.46,085 పలికింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో గోల్డ్ షాప్స్ మూసిఉన్నాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,085, 22 క్యారెట్లు 42,214, 18 క్యారెట్లు34,564గా ఉంది. మూడు శాతం జీఎస్టీ అదనం.

పెరిగిన బంగారం ధర
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1 శాతం పెరిగి రూ.45,768 పలికింది. గత వారం బంగారం ధర రూ.47,000 దాటిన విషయం తెలిసిందే. వెండి ధర కిలో 0.35 శాతం పెరిగి రూ.41,602 చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉదయం ఔన్స్ స్పాట్ గోల్డ్ 1,685.46కు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో ధర 2 శాతం తగ్గింది. ఈ రోజు స్వల్పంగా పెరిగింది.

ఇతర లోహాలు..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు ఔన్స్ 1700 డాలర్లకు సమీపంలో, ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు రూ.46,000 కాస్త పైన ఉంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.4 శాతం పెరిగి 749.76 డాలర్లు, వెండి 0.3 శాతం పెరిగి 14.88 డాలర్లు పలికింది.

మూడు రోజుల్లో రూ.2000 తగ్గి..
కాగా బంగారం ధరలు దేశీయంగా గత మూడు రోజుల్లో రూ.2,000 తగ్గాయి. ఈ రోజు మాత్రం స్వల్పంగా పెరిగాయి. బంగారం రూ.46,300 నుండి రూ.46,350 మధ్య నిలకడగా ఉంటే రూ.46,800 నుండి రూ.47,000 మధ్య ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం 1670 నుండి 1715 డాలర్ల మధ్య, రూ.45,500 నుండి రూ.46,400 మధ్య ఉండే అవకాశముంది.


Click it and Unblock the Notifications