For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: 2 రోజుల్లో రూ.2,000... భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

|

బంగారం ధరలు భారీగాపెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం రూ.45 వేలకు దిగువన ఉన్న పసిడి నేడు రూ.47,000 దిశగా పరుగులు పెడుతోంది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9400 మాత్రమే తక్కువగా ఉంది. గత రెండు మూడు సెషన్లలోనే రూ.2000 పెరిగిన పసిడి, ఇటీవలి రూ.12,400 తక్కువతో పోల్చినా రూ.3000 పెరిగింది. వెండి ధరలు కూడా రూ.67,000 క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్లు క్రాస్ చేయగా, వెండి 26 డాలర్ల దిశగా వెళ్తోంది. ప్రారంభంలో స్వల్పంగా నష్టపోయిన బంగారం ఆ తర్వాత అంతకంతకూ పెరిగింది.

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో భారీగా పెరిగింది. రూ.473.00 (1.02%) పెరిగి రూ.46,835.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,299.00 ప్రారంభమైన ధర, రూ.46,900.00 గరిష్టాన్ని, రూ.46,240.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.477.00 (1.02%) పెరిగి రూ.47080.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,586.00 ప్రారంభమైన ధర, రూ.47,109.00 గరిష్టాన్ని, రూ.46,558.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.67వేలు క్రాస్

వెండి రూ.67వేలు క్రాస్

వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.886.00 (1.33%) పెరిగి రూ.67520.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,400.00 వద్ద ప్రారంభమై, రూ.67,735.00 గరిష్టాన్ని, రూ.66,360.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.900.00 (1.33%) పెరిగి రూ.68500.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,406.00 ప్రారంభమైన ధర, రూ.69,079.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,313.00 కనిష్టాన్ని తాకింది.

1750 డాలర్లు దాటిన బంగారం

1750 డాలర్లు దాటిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగాయి. 16.10

(0.92%) డాలర్లు తగ్గి 1,757.70 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,733.65 - 1,759.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 25 డాలర్లకు పైనే ఉంది. +0.311 (1.23%) డాలర్లు తగ్గి 25.558 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.023 - 25.672 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold price today: 2 రోజుల్లో రూ.2,000... భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు | Gold price today: Yellow metal trades near Rs 46,700

Gold futures were trading with cuts on Thursday as investors turned to riskier assets after the US Federal Reserve's latest meeting minutes indicated continued policy support and cemented hopes of a quick economic turnaround.
Story first published: Thursday, April 8, 2021, 22:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X