Gold price today: రూ.45,000 వద్ద బంగారం ధరలు, వెండి భారీగా డౌన్
బంగారం ధరలు నేడు (మార్చి 23, మంగళవారం) మరింతగా క్షీణించాయి. గత కొన్నాళ్లుగా ధరలు రూ.45,000కు దిగువనే ముగుస్తున్నాయి. ఈ వారం బంగారం మద్దతు ధర రూ.44,660-44,500, నిరోధకస్థాయి రూ.45,150-45,300గా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. వెండి మద్దతు ధర రూ.65,800-65,500, నిరోధకస్థాయి రూ.67,000-67,600. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.11,400 వరకు తక్కువగా ఉంది.

రూ.45వేల దిగువనే పసిడి
గోల్డ్ ఫ్యూచర్ నేడు ఉదయం సెషన్‌లో స్వల్పంగా క్షీణించాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.72.00 (-0.16%) క్షీణించి రూ.44833.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,786.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,861.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,776.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,400 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45.00 (-0.10%) క్షీణించి రూ.45650.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,095.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,186.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,095.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.66వేల స్థాయికి
వెండి ధరలు నిన్న రూ.1200కు పైగా భారీగా క్షీణించాయి. నేడు స్వల్పంగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.269.00 (-0.41%) తగ్గి రూ.66062.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,026.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,144.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.183.00 (-0.27%) తగ్గి రూ.67151.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,151.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,151.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,151.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -3.50 (-0.20%) డాలర్లు తగ్గి 1,734.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,729.90 - 1,739.70 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతోంది. ఔన్స్ ధర 0.112 (-0.43%) డాలర్లు తగ్గి 25.657 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.595 - 25.915 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications