బంగారం ధరలు మంగళవారం(ఆగస్ట్ 24) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. వరుసగా ఒత్తిడిలో కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు కాస్త తగ్గుముఖం పట్టింది. డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడటం బంగారంపై ప్రభావం చూపుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు కాస్త తగ్గి, కిలో రూ.62,000కు దిగువనే ఉంది. బంగారం ధరలు ఈ నెల ప్రారంభంలో నాలుగు నెలల కనిష్టానికి రూ.45,600 దిగువకు పడిపోయాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56.200కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లు దాటింది. నేడు కాస్త తగ్గినప్పటికీ ఈ మార్కు పైనే ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల పైన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర స్వల్పంగా క్షీణించి 1780 డాలర్ల వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ 93 డాలర్లు క్రాస్ చేసి తొమ్మిదిన్నర నెలల గరిష్టానికి చేరుకుంది.
బంగారం ధరలు నేడు ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 97.00 (-0.20%) క్షీణించి రూ.47487.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.11.00 (0.02%) పెరిగి రూ.47754.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.169.00 (-0.27%) క్షీణించి రూ.62758.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.176.00 (-0.28%)క్షీణించి రూ.63432.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ గత కొన్ని సెషన్లుగా రూ.63,000 దిగువనే ఉంటోంది.

అంతర్జాతీయ మార్కెట్లో నిన్న గోల్డ్ఫ్యూచర్స్ 1800 డాలర్లు దాటింది. నేడు స్వల్పంగా తగ్గినప్పటికీ ఆ మార్కు పైనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్లో 2.45(-0.14%) డాలర్లు క్షీణించి 1,803.75 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.058 (-0.25%) డాలర్లు నష్టపోయి 23.598 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1770 డాలర్ల నుండి 1820 డాలర్ల మధ్య ఉండవచ్చునని, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.46,965- రూ.47,580 మధ్య కనిపించవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవ్‌నీత్ దమానీ అన్నారు.
More From GoodReturns

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications