భారీగా పెరిగి, అంతేస్థాయికి తగ్గిన బంగారం: వెండి దూకుడు
ముంబై: బంగారం ధరలు సోమవారం (డిసెంబర్ 28) స్వల్పంగా పెరిగాయి. ఉదయం భారీగా పెరిగిన ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఓ సమయంలో రూ.550 వరకు పెరిగిన ధర, ఆ తర్వాత దాదాపు ఆదే స్థాయి నుండి కిందకు పడిపోయింది. దీంతో సాయంత్రం సమయానికి స్వల్పంగా రూ.34 పెరుగుదలతో ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధినేత ట్రంప్ ఆర్థిక ప్యాకేజీపై సంతకం చేసిన నేపథ్యంలో పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది. అయితే ఆ తర్వాత ఒత్తిడి తగ్గి, ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లోను ఓ దశలో 1900 డాలర్లు దాటిన ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత 1885 డాలర్ల దిగువనే ట్రేడ్ అయింది.

భారీగా పెరిగి, అంతలోనే డమాల్
బంగారం ధరలు (ఫిబ్రవరి ఫ్యూచర్స్) నేడు సాయంత్రం సెషన్లో రూ.34.00 (0.07%) పెరిగి రూ.50107.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,580.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,915.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి 50వేల దిగువన కూడా కదలాడింది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1.00 (0.00%) పెరిగి రూ.50130.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,500.00 వద్ద ప్రారంభమై, రూ.50,602.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,030.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి దూకుడు
సిల్వర్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్లో ఏకంగా రూ.2000 పెరిగింది. సాయంత్రం సెషన్లో కాస్త తగ్గినా 1500కు పైన పెరుగుదల నమోదయింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.1,503.00 (2.23%) ఎగిసి రూ.69012.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,000.00 వద్ద ప్రారంభమై, రూ.69,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,379.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గత వారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది. ఇప్పుడు రూ.69వేలు దాటి రూ.70వేల దిశగా కనిపించింది. కానీ సాయంత్రానికి కాస్త తగ్గింది.
మే ఫ్యూచర్స్ రూ.1,574.00 (2.30%) పెరిగి రూ.69896.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,413.00 వద్ద ప్రారంభమై, రూ.70,543.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,367.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ప్రారంభంలో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. ప్రారంభంలో 15 డాలర్లకు పైగా పెరిగిన ధర ఆ తర్వాత 1 డాలర్ కంటే దిగువకు పడిపోయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.20 (+0.01%) డాలర్లు పెరిగి 1,883.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,874.05 - 1,904.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.93 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.717 (+2.77%) డాలర్లు పెరిగి 26.625 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.085 - 26.973 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 47.65% పెరిగింది.


Click it and Unblock the Notifications