బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. అంతక్రితం వారం వరకు రూ.45,000కు దిగువన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.46,000 క్రాస్ చేసింది. అదే సమయంలో వెండి కిలో స్వల్పంగా రూ.200 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గినప్పటికీ 1750 డాలర్లకు సమీపంలో ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల స్థాయికి వచ్చింది. పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.9,500 తక్కువగా ఉంది. ఓ సమయంలో రూ.12,400 తగ్గింది. అయితే ఇటీవల కరోనా కేసులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో ధరలు పెరిగాయి.

స్వల్పంగా పెరిగిన ధరలు
గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46వేలను క్రాస్ చేసింది. అక్కడే తచ్చాడుతోంది. నేడు ఆ మార్కుకు పైనే ట్రేడ్ అవుతోంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్‌లో రూ.17.00 (0.04%) తగ్గి రూ.46,610.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,545.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,508.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.50.00 (0.11%) పెరిగి రూ.46830.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,825.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,922.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,765.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప తగ్గుదల
వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.188.00 (-0.28%) క్షీణించి రూ.66795.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,786.00 వద్ద ప్రారంభమై, రూ.67,115.00 గరిష్టాన్ని, రూ.66,750.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.232.00 (-0.34%) తగ్గి రూ.67820.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,993.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,120.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 1741 డాలర్ల వద్ద ఉంది. -3.75 (0.21%) డాలర్లు పెరిగి 1,741.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,735.35 - 1,744.60 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.130 (0.51%) డాలర్లు తగ్గి 25.195 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.075 - 25.328 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications