బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000కు సమీపంలోనే ఉంది. ఇటీవల రూ.47,000 క్రాస్ చేసిన పసిడి, ఆ తర్వాత క్షీణించింది. గత కొద్ది రోజులుగా రూ.47,000కు కాస్త అటుఇటుగా కదలాడుతోంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, వెండి ధరలు మాత్రం రూ.500 వరకు పెరిగాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ప్రస్తుతం రూ.9300 వరకు తక్కువగా ఉంది. ఫెడ్ మీట్ అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.

రూ.47,000 దిగువనే పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.138.00 (0.29%) తగ్గి రూ.46955.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,245.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,299.00 గరిష్టాన్ని, రూ.46,905.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.96.00 (-0.20%) తగ్గి రూ.47296.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,606.00 వద్ద ప్రారంభమై, రూ.47,606.00 గరిష్టాన్ని, రూ.47,220.00 కనిష్టాన్ని తాకింది.

వెండి జంప్
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.564.00 (0.83%) పెరిగి రూ.68350.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,562.00 వద్ద ప్రారంభమై, రూ.68,729.00 గరిష్టాన్ని, రూ.68,230.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.489.00 (0.71%) పెరిగి రూ.69532.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,600.00 ప్రారంభమైన ధర, రూ.69,932.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,439.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. +2.05 (+0.12%) డాలర్లు పెరిగి 1,775.95 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,775.20 - 1,789.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 0.255 (0.98%) డాలర్లు పెరిగి 26.340 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.240 - 26.545 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications