ముంబై: బంగారం ధరలు నేడు (మే 3 సోమవారం) స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ రూ.47,000 దాటింది. యూఎస్ డేటాకు ముందు డాలర్ మ్యూట్‌గా ఉంది. అలాగే, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు క్షీణించాయి. క్రిప్టోకరెన్సీ పైన ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎగిశాయి. వెండి ధరలు కూడా నేడు కాస్త జంప్ చేశాయి.

రూ.47,000 పైకి బంగారం
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.268.00 (0.57%) పెరిగి రూ.47005.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,921.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,197.00 గరిష్టాన్ని, రూ.46,921.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.93.00 (0.62%) పెరిగి రూ.47344.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,300.00 వద్ద ప్రారంభమై, రూ.47,500.00 గరిష్టాన్ని, రూ.47,250.00 కనిష్టాన్ని తాకింది.

రూ.68వేలు దాటిన వెండి
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.587.00 (0.87%) పెరిగి రూ.68111.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,925.00 వద్ద ప్రారంభమై, రూ.68,300.00 గరిష్టాన్ని, రూ.67,768.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.696.00 (1.02%) పెరిగి రూ.69062.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,807.00 ప్రారంభమైన ధర, రూ.69,197.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,607.00 కనిష్టాన్ని తాకింది.

అక్కడ మళ్లీ పెరిగింది కానీ
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే 1775 డాలర్ల వద్దే కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 7.75 (0.44%) డాలర్లు పెరిగి 1,775.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,765.70 - 1,781.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. +0.330 (1.28%) డాలర్లు పెరిగి 23.203 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.858 - 26.207 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications